Home » Politics News You are browsing entries filed in “Politics News”

నిండుసభలో మంత్రుల ‘నీలి’ చేష్ట!

bf

బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక శాసనసభలో మంగళవారం సాయంత్రం జుగుప్సాకర సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై గంభీరమైన చర్చ జరుగుతుండగా.. అధికార బీజేపీకి చెందిన ఇద్దరు అమాత్యులు సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాన్ని చూస్తూ మీడియా కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది దర్జాగా తన మొబైల్ ఫోన్‌లో నీలి చిత్రాన్ని వీక్షించారు. ఆయన పక్కనే కూర్చున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీసీ పాటిల్ కూడా ఆ అశ్లీల దృశ్యాలను [...]

February 8th, 2012 | Posted in 2day Special,Politics News,Today News | Read More »

బీఎస్పీని ఎండగట్టిన సమాజ్‌ వాది చీఫ్ ములాయం సింగ్!

mulayamsingh-yadav

ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీఎస్పీని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఎండగట్టారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఉత్తరప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ములాయం హామీ ఇచ్చారు. యూపీలోని బీఎస్పీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ములాయం విరుచుకుపడ్డారు. యూపీ ముఖ్యమంత్రి మాయావతి ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. మాయావతి హయాంలో భూ కబ్జాలు, అవినీతికి అంతేలేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.  ఎన్నికల మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తామని [...]

February 7th, 2012 | Posted in Politics News,తెలుగు | Read More »

తమిళ అసెంబ్లీలో తెలుగులో మాట్లాడిన జయలలిత

jayalalita

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత శుక్రవారం అసెంబ్లీలో తెలుగులో మాట్లాడారు. హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్‌తో ఆమె తెలుగులో మాట్లాడారు. తెలుగు భాషా అభివృద్ధి కోసం ఏం చేయాలో చెప్పండని ఆమె ఆయనను అడిగారు. ఆమె తెలుగులో మాట్లాడటంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా తెలుగు వ్యక్తి అయిన, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటీ రోశయ్యే ఉన్నారు. ఆమె తెలుగు భాష అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించడం విశేషం. ఆమె పలు తెలుగు [...]

February 6th, 2012 | Posted in General News,Politics News | Read More »

నా దృష్టి పదవిపైకాదు: రాహుల్, మాయపై మండిపాటు

rahulgandhi

లక్నో: తన చూపు ప్రధానమంత్రి పదవిపై లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లో అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వారణాశి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొందరు ప్రధాన నేతల దృష్టి పిఎం పదవిపై ఉండవచ్చుని, కానీ తన దృష్టి మాత్రం లేదన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం పైనే తాను దృష్టి సారిస్తున్నానని అన్నారు. అవినీతి అంటూ రథయాత్ర చేస్తున్న బిజెపి అగ్రనేత [...]

February 6th, 2012 | Posted in Politics News,Today News | Read More »

నానావతి ఎదుట హాజరీపై హైకోర్టులో మోడికి ఊరట

narendra modi

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి బుధవారం ఊరట లభించింది. 2002లో గోద్రా దుర్ఘటనపై నరేంద్ర మోడీ జస్టిస్ నానావతి కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని గుజరాత్ అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. 2002 గోద్రా సంఘటనపై మోడికి నోటీసులు ఇవ్వాలని కోరుతు జన సంఘర్షణ మంచ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. మోడీ కమిషన్ ఎదుట హాజరు కావాలన్న [...]

February 6th, 2012 | Posted in 2day Special,Politics News | Read More »

ఐఏస్‌ల పైనా నమ్మకం పోతోంది: తప్పుపట్టిన ఉండవల్లి

  విజయవాడ: రాజకీయ నేతలంటే ప్రజల్లో ఎప్పుడో నమ్మకం పోయిందని, తాజాగా ఐఏఎస్‌లు అంటే కూడా ప్రజలకు నమ్మకం పోతోందని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం కృష్ణా జిల్లాలో అన్నారు. రాజకీయ నేతల్లాగే అధికారులపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమన్నారు. ఐఏఎస్‌లు తీసుకునే నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణపై ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ [...]

February 5th, 2012 | Posted in Politics News | Read More »

చిదంబరానికి ఊరట, స్వామి పిటీషన్ కొట్టివేత

Chidambaram

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్రం హోంమంత్రి చిదంబరాన్నినిందితుడిగా చేర్చాలని కోరుతూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ ను ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. దీంతో చిదంబరానికి ఊరట లభించింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఇంతటితో అయిపోలేదని, తాను హైకోర్టుకు వెళ్తానని కోర్టు తీర్పు అనంతరం సుబ్రహ్మణ్య స్వామి మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. పిటిషన్‌పై విచారణకు [...]

February 4th, 2012 | Posted in 2day Special,Politics News | Read More »

YS Jaganmohan Reddy announce his 590 km padayatra

jagan-590-km-padayatra

Hyderabad: In a strategic move, YSR Congress Party president YS Jaganmohan Reddy is contemplating to announce his 590 km padayatra demanding the government to accord national project status for Pranahitha- Chevella project in the Telangana region today at a public meeting after the completion of his 48-hour deeksha. This, according to party insiders, will be a [...]

January 12th, 2012 | Posted in 2day Special,Politics News | Read More »

సిఎం బాలయ్య అంటూ నినాదాలు, దాసరి విసుర్లు

06-dasari-bala06-300

హైదరాబాద్: శ్రీ రామ రాజ్యం యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన అర్ధశత దినోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ అభిమానులు సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ మాట్లాడటానికి వస్తుండగా అభిమానులు ఒక్కసారిగా కాబోయే సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. శ్రీ రామ రాజ్యం అర్ధ శతదినోత్సవ వేడుక అర్ధరాత్రి వరకు సాగింది. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతూ… లవకుశ, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు యుగానికి [...]

January 6th, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,Politics News | Read More »

ఆజాద్‌కు చిరంజీవి విందు, ముఖ్యమంత్రి గైర్హాజరు

06-chiru0107-300

హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు శుక్రవారం ఇచ్చిన అల్పాహార విందుకు సమన్వయ కమిటీ సభ్యుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్లమెంటు కావూరి సాంబశివ రావు మినహా మిగతా వారు హాజరయ్యారు. ఉదయం చిరంజీవి ఆజాద్‌కు అల్పాహార విందు ఇచ్చారు. దీనికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ చీఫ్ డి శ్రీనివాస్, స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కెవిపి రామచంద్ర రావు, షబ్బీర్ అలీ, పలువురు చిరు [...]

January 6th, 2012 | Posted in 2day Special,AP పాలటిక్స్ న్యూస్,Politics News | Read More »