Home » September 26th, 2011 Entries posted on “September, 2011”

చిరు హిట్ సిఎం ఫట్, ఓదార్పు చేపట్టాలి: అంబటి

26-ambati-300

గుంటూరు: ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారి కోసం తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ఓదార్పు యాత్ర చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం సూచించారు. చిరంజీవిని నమ్ముకొని గత ఎన్నికల్లో పలువురు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోటీ చేసి ఓడి పోయారని ఇళ్లు గుల్ల చేసుకున్న వారిని చిరంజీవి ఓదార్చితే బాగుంటుందన్నారు. ఆయన మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరుకు సెజ్‌ల గురించి తెలియకుంటే ముఖ్యమంత్రి [...]

September 26th, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్,Politics News | Read More »

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, జూలకంటి రాజీనామాకు పట్టు

26-ntr-statue23-300

హైదరాబాద్: అదిలాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పట్టణంలోని శ్రీరాంపురంలో దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు రహదారి పైకి వచ్చి ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. తెలంగాణ ఏర్పడే [...]

September 26th, 2011 | Posted in More.. | Read More »

ఐటిని తాకిన తెలంగాణ సెగ, ఎమ్మెల్యే మంచిరెడ్డి అరెస్టు

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మె సోమవారం ఐటిని తాకింది. హైటెక్ సిటి ప్రాంతానికి వెళ్లే ఐటి ఉద్యోగులను తెలంగాణవాదులు కూకట్‌పల్లి – హైటెక్ సిటీ రహదారిలో అడ్డుకున్నారు. భారీగా రహదారి పైకి వచ్చిన తెలంగాణవాదులు హైటెక్ సిటీ వెళ్లే అన్ని దారులను మూసి వేశారు. ఐటి కార్యాలయాలు మూసి వేయాలంటూ నినాదాలు చేశారు. విధులకు వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ [...]

September 26th, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్ | Read More »

అనుష్క, త్రిష….: బెండతోటలో హీరోయిన్లు!

26-anushka3-300

ఏలూరు: సాధారణంగా హీరోయిన్ల ఫోటోలు సినిమా థియేటర్లలో, అభిమానం ఉంటే ఇళ్లలో లేదంటే గోడల పైన చూస్తాం. కానీ గోదావరి జిల్లాలో రైతులు వెరైటీగా తమ పంట పొలాల్లో హీరోయిన్ల ఫోటోలు పెట్టుకున్నారట! పంట పొలాలకు నర దిష్టి తగలకుండా, జంతువులు పంట పొలాలను నాశనం చేయకుండా ఉండటానికి రైతులు దిష్టి బొమ్మలను పెడతారు. కానీ ఈ రైతులు మాత్రం నర దిష్టి తగలకుండా ఏకంగా అనుష్క, త్రిష తదితర హీరోయిన్ల ఫోటోలనే పెద్ద కటౌట్ మాదిరిగా [...]

September 26th, 2011 | Posted in తెలుగు మూవీ న్యూస్ | Read More »

2జి చిక్కుల్లో చిదంబరం: బయటపడిన ప్రణబ్ లేఖ

21-pranab

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. దీంతో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చిక్కుల్లో పడినట్లే. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపు వ్యవహారాల్లో చిదంబరం పాత్రను తప్పు పడుతూ ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది మార్చిలో ఓ లేఖ రాశారు. ఆ లేఖ బయటకు వచ్చింది. 2జి స్పెక్ట్రమ్‌ను మొదట వచ్చిన వారికి మొదట అంటూ తక్కువ ధరకు కేటాయించడానికి బదులు వేలం వేయాలని చిదంబరం సూచించి [...]

September 23rd, 2011 | Posted in తెలుగు | Read More »

సిబిఐకి చిక్కిన గాలి జనార్ధన్ రెడ్డి పిఏ?

22-janardhan-reddy128-300

బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి పిఎను సిబిఐ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. కర్నాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా హర్పనహళ్లిలో సిబిఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేసిన సిబిఐ అధికారులు అదే రోజు రాత్రి హైదరాబాదుకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గాలి అరెస్టు అనంతరం పదహారు మంది ఆయన అనుచరులకు సిబిఐ నోటీసులు పంపింది. [...]

September 23rd, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్ | Read More »

ఇప్పుడే తెరవద్దు: అనంత పద్మనాభుని ఆరో గదిపై సుప్రీం

22-padmanabhaswamy-temple14-300

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి ఆలయ ఆరో నేలమాళిగ చిక్కు ఇంకా వీడలేదు. ఆలయానికి గట్టి భద్రత ఏర్పాటు చేశాక ఆరో నేలమాళిగను తెరవాలా వద్దా అనే నిర్ణయం కోర్టు తీసుకుంటుందని గురువారం సుప్రీం కోర్టు చెప్పింది. పూర్తి భద్రత కల్పించాకే నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. ఆలయానికి కేరళ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత పట్ల సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మరింత భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. [...]

September 23rd, 2011 | Posted in తెలుగు | Read More »

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ దూకుడు పబ్లిక్ టాక్ ఏంటీ..?

23-dookudu323-300

ఎన్నో అంచనాలతో బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టేందుకు సూపర్ స్ట్రార్ ప్రిన్స్ మహేష్ ‘దూకుడు’ అంగరంగ వైభవంగా సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా 1200 ధియేటర్లలలో, 50, 400 ప్రింట్లతో విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు నుండే ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో తెలుగు సినిమా చరిత్రలో మగధీర రికార్డులను బద్దలు చేస్తుందని మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతుంది. దూకుడు సినిమా యావత్ ప్రిన్స్ మహేష్ అభిమానులను [...]

September 23rd, 2011 | Posted in తెలుగు మూవీ న్యూస్ | Read More »

కందిరీగ పోరగాడికి మహేష్‌ బాబు సిస్టర్ చేయూత

23-manjula23-300

హీరో రామ్, ప్రఖ్యాత డైరెక్టర్ గౌతం మీనన్ ప్రాజెక్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. రామ్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని కొందరంటుంటే, కెరియర్‌లో పెద్ద అవకాశాన్ని వదులుకున్నాడు అంటూ మరికొందరు అంటున్నారు. రామ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే…..రామ్ హీరోగా గౌతం ఓ ప్రేమకథను మూడు భాషల్లో రూపొందించాలని అనుకున్నాడు. అయితే రామ్ తో మాత్రం రెండు భాషల్లో మాత్రమే అని చెప్పి, అంత మేరకు రెమ్యూనరేషన్ తోనే అగ్రిమెంట్ రాయించుకున్నాడు. పని [...]

September 23rd, 2011 | Posted in తెలుగు మూవీ న్యూస్ | Read More »

గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

23-high-court13-300

హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ మెయిన్స్ నిలిపి వేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ నెల 25న జరగాల్సిన గ్రూప్ వన్ మెయిన్స్ యధావిథిగా జరగనున్నాయి. కటాఫ్ మార్కులు 85 మార్కుల నుండి 83 మార్కులకు తగ్గించింది. అయితో నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులనే భర్తీ చేయాలని అదనపు పోస్టుల భర్తీకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్టులనే భర్తీ చేయాలని [...]

September 23rd, 2011 | Posted in AP పాలటిక్స్ న్యూస్ | Read More »